మొన్న అలా.. నిన్న ఇలా: మహిళకు పోప్ ఫ్రాన్సిస్ క్షమాపణ…

6:33 am, Thu, 2 January 20

వాటికన్ సిటీ: తన చేతిని పట్టుకుని లాగిన మహిళపై మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసిన పోప్ ఫ్రాన్సిస్.. తాజాగా ఆమెకు క్షమాపణలు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మంగళవారం చిన్నారులు, భక్తుల మధ్యలో నడుస్తూ పోప్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ క్రమంలో గుంపులోంచి ఓ మహిళ అకస్మాత్తుగా ఏదో అంటూ పోప్ ఫ్రాన్సిస్ చేయి పట్టుకుని తన వైపునకు లాగింది. ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయిన పోప్.. ఆ మహిళ చేసిన పనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన పోప్ తాను ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళకు బుధవారం క్షమాపణలు చెప్పారు.