చెబితే వినరేంటి?: కేఏ పాల్ రేంజ్ ఏమిటో తెలుసా?

6:18 pm, Mon, 29 April 19
KA Paul Latest News, Prajashanthi Party News, AP News, Newsxpressonline

శ్రీలంక: ప్రపంచంలోని ప్రముఖులంతా తన స్నేహితులేనని క్రైస్తవ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఎన్నోసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. కానీ, ఆయన గురించి తెలియని వారు మాత్రం ఇప్పటికీ ఆయన వ్యాఖ్యలను చాలా తేలికగా తీసుకుంటుంటారు. ఆయన స్థాయి ఏంటో తెలియజెప్పే ఘటన ఒకటి ఇప్పుడు శ్రీలంకలో జరిగింది.

శ్రీలంకలో ఉగ్రదాడి తర్వాత అక్కడ శాంతిని నెలకొల్పేందు కేఏ పాల్ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా పాల్‌ను శ్రీలంక మాజీ అధ్యక్షుడు, ఆయన పాత స్నేహితుడు మహీంద్ర రాజపక్స తన నివాసానికి ఆహ్వానించారు. పాల్‌కు అతిథి మర్యాదలు చేశారు.

గతంలో సునామీ కకావికలం చేసినప్పుడు ఆ దేశానికి పాల్ తన చారిటీ సంస్థ తరుపున భారీ సాయాన్ని అందజేశారు. ఈ సాయాన్ని రాజపక్స గుర్తుంచుకున్నారు. అందుకే కేఏ పాల్ తమ దేశానికి వచ్చారని తెలియగానే ఆయన్ని తన నివాసానికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చారు.

మరోవైపు, తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై కూడా కేఏ పాల్.. శ్రీలంక నుంచే స్పందించిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు, వారి కుటుంబాలకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.

చదవండి:  ఓట్లను లెక్కిస్తూ 278 మంది మృతి! 1,878 మందికి అస్వస్థత!