పాక్ విమానాలపై ఆరు నెలల నిషేధం విధించిన యూరోపియన్ యూనియన్

- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్థాన్ పైలట్లు అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ) కు చెందిన విమానాలపై ఆరు నెలలపాటు నిషేధం విధించింది.

నేటి నుంచి అమల్లోకి రానున్న ఈ నిషేధం డిసెంబరు 31 వరకు అమల్లో ఉంటుంది. 860 మంది పాక్ పైలట్లలో 262 మంది పైలట్ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడినట్టు బయటపడింది.

- Advertisement -

ఇటీవల పాక్‌లో జరిగిన విమాన ప్రమాదం అనంతరం ఈ విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే యూరోపియన్ యూనియన్ తాజా నిర్ణయాన్ని ప్రకటించింది.

- Advertisement -