పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 65 మంది సజీవ దహనం

11:31 am, Thu, 31 October 19

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. తేజ్‌గామ్ ఎక్స్ ప్రెస్‌లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 65మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. 30మంది తీవ్రంగా గాయపడ్డారు. రైలు కరాచీ నుంచి రావల్పిండి వెళ్తోంది.

ప్రయాణికుడి దగ్గర ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో ప్రమాదం జరిగింది.ఈ తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. తేజ్‌గామ్ ఎక్స్ ప్రెస్ లాహోర్-కరాచీ మధ్య నడుస్తుంది. గ్యాస్ సిలెండర్ పేలడంతో మంటలంటుకున్నాయి. మూడు బోగీలు దగ్ధమయ్యాయి.

రహీమ్ యార్ ఖాన్ సమీపంలోని లియాఖత్‌పూర్ దగ్గర రైలు ప్రమాదానికి గురైంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంచారు.

గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇతర బోగీలకు మంటలు వ్యాపించకుండా ఇంజిన్ నుంచి వేరు చేశారు. ఈ ఘటనపై పాకిస్తాన్ రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు.