వెయ్యేళ్ల నాటి నిధి ఇప్పుడు వెలుగులోకి.. మట్టిపాత్రలో వందలకొద్దీ బంగారు నాణేలు! ఎక్కడంటే…

- Advertisement -

జెరూసలేం: ఓ మట్టి పాత్రలో దాచిన వెయ్యేళ్ల నాటి వందలకొద్దీ బంగారు నాణేలను ఇజ్రాయెల్‌లో కొందరు యువకులు గుర్తించారు. ఈనెల 18న ఈ నిధిని కనుగొన్నట్టు ఇజ్రాయెల్‌ పురాతన సంపద అథారిటీ సోమవారం తెలిపింది.

మధ్య ఇజ్రాయెల్‌లో జరుగుతున్న తవ్వకాల వద్ద ఈ నిధి వలంటీర్ల కంటపడిందని అధికారులు తెలిపారు.

- Advertisement -

1100 సంవత్సరాల క్రితం ఈ బంగారు నాణేలను భూమిలో పాతిపెట్టిన వ్యక్తి వాటిని అప్పట్లోనే తిరిగి తీసుకువెళ్లాలని ఆశించాడని, ఇందుకోసం ఆ ప్రాంతంలో ఒక ఓడను కూడా సిద్ధం చేశాడని ఇజ్రాయెల్‌ అధికారి లియత్‌ నదవ్‌జివ్‌ వెల్లడించారు.

అయితే, ఆ సంపదను అతడు ఎందుకు తీసుకెళ్లలేకపోయాడనేదే అంతుబట్టడం లేదని అన్నారు.  

అత్యంత విలువైన సంపదను దాచిన సమయంలో ఆ ప్రాంతంలో వర్క్‌షాపులు ఉండేవని, వాటి యజమాని ఎవరనేది ఇప్పటికీ అంతుబట్టని విషయమని పేర్కొన్నారు.

పురాతన బంగారు నాణేలను కనుగొన్న వలంటీర్లలో ఒకరైన ఒజ్‌ కొహెన్‌ ఇవి అద్భుతంగా ఉన్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

తవ్వకాల్లో భాగంగా భూమిని తవ్వుతున్న క్రమంలో తాను ఈ బంగారు నాణేలను చూశానని, ఇలాంటి ప్రత్యేక పురాతన సంపదను కనుగొనడం ఉద్వేగంతో కూడిన అనుభవమని చెప్పారు.

తొమ్మిదో శతాబ్ధంలో అబ్బాసిద్‌ కాలిఫేట్‌ హయాంకు చెందిన 425 నాణ్యమైన 24 క్యారెట్‌ బంగారు నాణేలు అప్పట్లో చాలా విలువైనవని పురాతన సంపద అథారిటీకి చెందిన నాణేల నిపుణులు రాబర్ట్‌ కూల్‌ అన్నారు.

- Advertisement -