అసలే కరోనా.. ఆపైన ట్రంప్ ర్యాలీ.. మళ్లీ ప్రభుత్వం వింత రూల్!

- Advertisement -

వాషింగ్టన్: కరోనా విజృంభణ తర్వాత తొలిసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ ర్యాలీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఓక్లహామాలోని టుస్లాలో ఈ ర్యాలీ జరగనుంది.

బీవోకే సెంటర్‌లో ట్రంప్ సభ జరగనుంది. దీనిలో కనీసం 19వేలమంది కూర్చునే సదుపాయం ఉంది. ఈ ర్యాలీలో పాల్గొనే వారికి అధ్యక్షుడి క్యాంపెయిన్ వెబ్‌సైట్ ఓ వింత రూల్ పెడుతోంది.

- Advertisement -

అదేంటంటే, ర్యాలీలో పాల్గొనే అభిమానుల్లో ఎవరికైనా కరోనా సోకితే, వారెవరూ ట్రంప్‌పై కోర్టుకెళ్లకూడదట. దీనికి ఒప్పుకుంటేనే ర్యాలీలో పాల్గొనాలని సదరు వెబ్‌సైటులో అధికారులు పేర్కొన్నారు. ఈ హెచ్చరిక చూసిన ప్రజలు.. ఇదేం వింత నిబంధన? అంటూ షాకవుతున్నారు.

- Advertisement -