ఇండియా ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన లేదు: ట్రంప్

9:38 am, Thu, 6 June 19
donald-trump

లండన్: నిన్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్….ఇండియాని లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ప్రజలకు పరిశుభ్రతపై అసలు అవగాహన లేదని విమర్శించారు.

ప్రస్తుతం లండన్‌ పర్యటనలో ఉన్న ట్రంప్…ఓ బ్రిటిష్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… అమెరికాలో ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీలుస్తుంటే, ఇండియా, చైనా, రష్యా వాసులు కలుషిత వాతావరణంలో బతుకుతున్నారని అన్నారు.

ఇక ఈ దేశాల్లోని కొన్ని నగరాలకి వెళితే కనీసం గాలిని కూడా పీల్చుకునే పరిస్థితి లేదని, అయితే ఆ నగరాల పేర్లు కూడా చెప్పలేనని ఎద్దేవా చేశారు. అసలు ఈ దేశాల్లో పరిశుభ్రమైన గాలి, నీరు లభించే పరిస్థితి లేదని, వీరు పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నించడం లేదని అన్నారు.

ఇక ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన వాతావరణం ఉన్న దేశాల్లో అమెరికా ఒకటని, తాను ప్రిన్స్ చార్లెస్ తో 15 నిమిషాల పాటు మాట్లాడాలని అనుకున్నానని, కానీ పర్యావరణం గురించి మాట్లాడేసరికి అది గంటన్నర పాటు సాగిందని చెప్పుకొచ్చారు.

చదవండి: జూలై 4 నుంచి ‘తానా’ మహాసభలు.. ట్రంప్, చంద్రబాబు, కేసీఆర్‌కు ఆహ్వానం!