నడి సముద్రంలో నకిలీ యుద్ధనౌక.. ఇరాన్ సరికొత్త ప్రయోగం

- Advertisement -

టెహ్రాన్: అమెరికాను ఎదుర్కొనేందుకు ఇరాన్ సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ వినూత్న ఆలోచన చేసింది.

దేశ జల సరిహద్దుల్లో  ఓ నకిలీ యుద్ధ నౌకను నిర్మించింది. దాని సాయంతో యుద్ధం రంగంలో పాటించాల్సిన పద్ధతులను పరీక్షించింది.

- Advertisement -

పర్షియన్ జల సంధిలో నిఘా కోసం అమెరికా నిత్యం రంగంలోకి దింపే నిమిట్స్ క్లాస్ తరహా నౌకలను ఈ యుద్ధ నౌక పోలి ఉంటుందని సమాచారం.

బందర్ అబ్బాస్ పోర్టులో ఈ నౌకను నిలిపి ఉంచినట్టు తెలిపుతున్న శాటిలైట్ చిత్రాలను అంతర్జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచురించింది.

2015లోనూ ఇరాన్ ఇటువంటి మాక్ డ్రిల్స్‌కు పూనుకుంది. ఓ నకిలీ నౌకను నడి సముద్రంలో ఎలా పేల్చేయాలనే వ్యూహాన్ని పరీక్షించింది.

తాజా ఘటనలోనూ ఇదే తరహా ప్రయాత్నాన్ని చేపట్టబోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అమెరికాను హెచ్చరించేందుకు ఇరాన్ ఈ నౌకను నిర్మించినట్ల కొందరి అభిప్రాయం. 

మరి అమెరికా ఎలాంటి సమాధానం చెబుతుందో ఏమో వేచి చూడాలి.

- Advertisement -