ఉద్యమ నేత, జర్నలిస్ట్ రొహల్లాకు మరణశిక్ష విధించిన ఇరాన్

6:01 pm, Wed, 1 July 20

టెహ్రాన్: ప్రజా ఉద్యమనేత, జర్నలిస్ట్ రుహల్లా జామ్‌కు మరణశిక్ష విధించినట్టు ఇరాన్ ప్రకటించింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో శిక్ష విధించినట్లు స్థానిక మీడియా తెలిపింది. 2017లో మతపరమైన షియా ఆర్థిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపర్చటం ద్వారా రొహల్లా ఇరాన్‌లో భారీ ప్రజాందోళనకు స్ఫూర్తిదాతగా నిలిచారు.

 

రుహోల్లా చేసిన నేరాన్ని దేశంలోని అత్యంత తీవ్రమైన నేరాలలో ఒకటిగా భావిస్తున్నట్లు న్యాయవ్యవస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఫ్రాన్స్‌లో తలదాచుకున్న రుహోల్లా గతేడాది అరెస్టయ్యాడు.