68వ అందాల పోటీలు: మిస్ వరల్డ్ 2018గా… మెక్సికో యువతి వనెస్సా!

miss-world-2018-vanessa
- Advertisement -

miss-world-2018-vanessa-3

బీజింగ్: 2018 సంవత్సరానికిగాను మిస్ వరల్డ్ కిరీటాన్ని మెక్సికన్‌ యువతి దక్కించుకుంది. మెక్సికోకు చెందిన మిస్‌ మెక్సికో వనెస్సా పోన్స్‌-డి-లియోన్‌ ప్రపంచసుందరిగా నిలిచింది. చైనాలోని సాన్యా సిటీ ఎరెనాలో 68వ అందాల పోటీలను అట్టహాసంగా నిర్వహించారు. అందాల పోటీల ఫైనల్స్ వేడుకలు డ్యాన్స్ పోటీలతో అభిమానులను ఉర్రూతలూగించాయి. అమెరికా స్టార్ డోనెల్ మంజేనా తన పాటలు, స్టెప్పులతో అలరించింది.

భారత అందాల సుందరి, 2017 మిస్ వరల్డ్ మానుషీ ఛిల్లార్ ఈ అందాల పోటీల వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మనదేశానికి చెందిన మానుషీ గతేడాది ఇదే వేదికపై అందాల కిరీటాన్ని దక్కించుకోగా, ఈ ఏడాది ఆమె తన వారసురాలు వనెస్సాకు అందాల కిరీటాన్ని పెట్టి అభినందనలు తెలిపింది.

ఈ ఏడాది వివిధ దేశాల నుంచి 118 మంది సుందరీమణులు పోటీపడగా.. వనెస్సా డిలియోన్‌నే విజయం వరించింది. ఈ పోటీల్లో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన అనుకీర్తి వ్యాస్ నిరాశ పరిచింది.

ఫైనల్లో మిస్ మెక్సికో వనెస్సా ఆకట్టుకునే గౌన్‌ ధరించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు కూడా అద్భుతంగా సమాధానాలిచ్చింది. ప్రపంచ సుందరిగా మీ స్థాయిని ఇతరుల కోసం ఏ విధంగా ఉపయోగిస్తారని అడిగిన ప్రశ్నకు వనెస్సా చెప్పిన సమాధానం న్యాయనిర్ణేతల హృదయాలను గెలుచుకుంది.

- Advertisement -