ట్రంప్‌కు షాక్ ఇచ్చిన కిమ్.. దక్షిణ కొరియాతో చర్చలు నిలిపివేత!

- Advertisement -

ప్యాంగ్‌యాంగ్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ షాక్ ఇచ్చారు.  అంతేకాదు, దక్షిణ కొరియాతో జరుగుతున్న చర్చలను కూడా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు.  అణ్వస్త్రాల నిరాయుధీకరణ, కొరియా యుద్ధానికి అధికారికంగా ముగింపు పలకడంపై దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల నడుమ చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఒకవైపు చర్చలు జరుగుతుండగానే మరోవైపు అమెరికా-దక్షిణ కొరియాలు మిలటరీ విన్యాసాలు చేయడానికి సిద్ధమవుతుండడం ఉత్తర కొరియా అధినేతకు తీవ్ర ఆగ్రహం కలిగించింది.  అమెరికా  ఇలా చేయడం ఉత్తరకొరియాను రెచ్చగొట్టడమేనని  కిమ్ భావిస్తున్నారు.  ఈ నేపథ్యంలో సింగపూర్‌లో ట్రంప్‌-కిమ్‌ జాంగ్‌ ఉన్‌ల మధ్య జరగాల్సిన భేటీపై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. ఉత్తరకొరియాను తన మాటలతో లొంగదీశానని తనకు తాను గొప్పలు చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడికి ఇది గట్టి ఎదురుదెబ్బే!

- Advertisement -
- Advertisement -