మా అదుపులోనే ఇద్దరు ఐఏఎఫ్ పైలట్లు: పాక్, వీడియో రిలీజ్, ఒక పైలట్ అదృశ్యమంటూ భారత్

indian pilot
- Advertisement -

indian pilot2
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ‌: భారత వాయుసేనకు చెందిన రెండు విమానాలను తాము కూల్చేశామని, తమ‌ భూభాగంలో కూల్చేసిన ఓ విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లను అదుపులోకి తీసుకొన్నట్లు పాకిస్థాన్ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించినదిగా చెబుతున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌‌గా మారింది.

భారత వాయుసేనకు చెందిన వింగ్‌ కమాండర్‌ విక్రమ్‌ అభినందన్‌ అనే పైలట్‌ను అదుపులోకి తీసుకున్నట్లుగా ఉన్న వీడియోను పాక్ విడుదల చేసింది. కాగా, ఈ వీడియోలోని వ్యక్తి భారత వాయుసేన దుస్తులను ధరించి ఉన్నాడు. తన పేరు వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ అని ఆ వ్యక్తి చెబుతుండటం గమనార్హం.

అతని చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. కళ్లకు కూడా గంతలు కట్టి ఉన్నాయి. తాము అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చిన అభినందన్.. మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని పాక్ అధికారులు వెల్లడించారు. తమ అదుపులో ఉన్న మరో భారత పైలట్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు పాక్ వర్గాలు తెలిపాయి.

ఒక పైలట్ మిస్సయ్యాడంటూ భారత్..

అయితే భారత్‌కు చెందిన యుద్ధ విమానాలను కూల్చివేశామన్న పాక్‌ ప్రకటనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. భారత వాయుసేనకు చెందిన పైలెట్లు అందరూ సురక్షితంగానే ఉన్నట్లు రక్షణ శాఖ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే, పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని వెంటాడుతున్న వెళ్లిన ఒక పైలట్ అదృశ్యమైనట్లు  తెలిపాయి. అతనే పాకిస్థాన్‌ బలగాలకు చిక్కివుంటాడని అనుమానిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా, భారత్‌కు చెందిన రెండు యుద్ధవిమానాలను కూల్చినట్లు పాకిస్థాన్‌కు ఇంటర్‌ సర్వీస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డీజీ ఆసీఫ్‌ గఫూర్‌ వెల్లడించారు. పాక్‌ యుద్ధవిమానాలను వెంటాడుతూ నియంత్రణ రేఖను దాటిన రెండు భారత వాయుసేనకు చెందిన యుద్ధవిమానాలను కూల్చివేసినట్లు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వీటిలో ఒక విమానాన్ని పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో కూల్చేయగా.. మరో విమానాన్ని కాశ్మీర్‌లో కూల్చివేసినట్లు పేర్కొన్నారు. భారత వాయుసేనకు చెందిన ఒక పైలట్‌ను అదుపులోకి తీసుకొన్నట్లు వెల్లడించారు.

చదవండి: పుల్వామాలో ఉగ్ర దాడి తర్వాతి రోజే మెరుపు దాడులకు గ్రీన్ సిగ్నల్!: అంతా సీక్రెట్‌గానే..

- Advertisement -