కరెంట్ బకాయిలు చెల్లించలేని స్థితిలో పాక్ ప్రధాని కార్యాలయం

- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఎంతలా అంటే? సాక్షాత్తూ ఆ ప్రధాని కార్యాలయమే రూ.40 లక్షలకు పైగా బకాయి పడింది. దీంతో విద్యుత్ అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు. ప్రధాని కార్యాలయం గత కొన్ని నెలలుగా విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో అవి తడిసిమోపెడయ్యాయని ఆ దేశ మీడియా పేర్కొంది. పాక్ కరెన్సీలో ఏకంగా రూ.41 లక్షల మేర బకాయిలు పేరుకుపోయాయి. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లయ్ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ప్రధాని కార్యాలయం నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో తాజాగా, బుధవారం మరోమారు నోటీసులు జారీ చేశారు. పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించకుంటే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అందులో హెచ్చరించినట్టు మీడియా పేర్కొంది.

- Advertisement -