నా జీవితంలో నేను చేసిన మంచి పని పోర్న్ స్టార్‌గా మారడమే: రేసర్ రెనీ గ్రేసీ

10:51 am, Tue, 9 June 20

మెల్‌బోర్న్: జీవితంలో తానేదైనా మంచి చేశానంటే అది పోర్న్ స్టార్‌గా మారడమేనని ఆస్ట్రేలియా మాజీ రేసర్ రెనీ గ్రేసీ పేర్కొంది. రేసింగులో తన ప్రదర్శన కంటే అందంతోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందీ అమ్మడు.

అయితే, ఆ తర్వాత ఆమె ప్రదర్శన క్రమంగా దిగజారడంతో 2017లో కెరియర్‌ను వదిలిపెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత బతుకుదెరువు కోసం ఓ కారు యార్డులో పనిచేసింది. అయితే, అది ఆమెకు సంతృప్తిని ఇవ్వలేదు. 

‘ఓన్లీఫ్యాన్స్’ చూశాక…

ఈ క్రమంలో ఓసారి ‘ఓన్లీఫ్యాన్స్’ అనే అడల్ట్ వెబ్‌సైట్ చూసిన తర్వాత ఆమెకు తన భవిష్యత్ అర్థమైంది. వెంటనే తన నగ్న ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తూ తొలి వారం రోజుల్లోనే ఏకంగా రూ. 2.5 లక్షలు సంపాదించింది.

రెనీ అందం ఇప్పుడామెను క్రేజీ పోర్న్‌స్టార్‌గా మార్చింది. జీవితంలో తాను చేసిన మంచి పని పోర్న్ స్టార్‌గా మారడమేనని పేర్కొన్న రెనీ.. ఈ వృత్తి ద్వారా గత 30 ఏళ్ల ఇంటి రుణాన్ని ఈ ఏడాదిలో చెల్లించేసినట్టు గర్వంగా పేర్కొంది.

అంతేకాదు, తన కుటుంబ సభ్యులు కూడా తనకు మద్దతు పలికారని, తన తండ్రి కూడా గర్వపడుతున్నారని రెనీ చెప్పుకొచ్చింది.