నా ఉద్యోగం నల్లజాతీయుడికి ఇవ్వండి: టెన్నిస్ స్టార్ భర్త

- Advertisement -

వాషింగ్టన్: ఇటీవల అమెరికాలో జరిగిన నల్లజాతీయుడి మరణోదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడికి న్యాయం జరగాలంటూ అమెరికాలో భారీ స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. 

ప్రపంచం మొత్తం జాతివివక్షకు వ్యతిరేకంగా జార్జ్ తరపున నిలబడింది. ఈ నేపథ్యంలో జార్జ్‌కు మద్దతుగా టెన్నిస్ స్టార్ సెరెనీ విలియమ్స్ భర్త అలెక్సిస్ ఒహానియన్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 

- Advertisement -

‘నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా.. నా ఉద్యోగం ఎవరైనా నల్లజాతీయుడికి ఇవ్వండి’ అంటూ ఆన్‌లైన్ సంస్థ రెడిట్ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్ సంస్థ బోర్డును కోరారు.

నల్లజాతీయులపై సాగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి తాను మద్దతు తెలుపుతున్నానని, అందుకే తన పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పారు.

రెడిట్ సహ వ్యవస్థాపకుడైన ఒహానియన్, సంస్థ బోర్డులో కూడా కీలక పదవిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో తన భార్య, కూతురుకు సమాధానం చెప్పేందుకే రాజీనామా చేస్తున్నానని అలెక్సిస్ చెప్పారు.

‘జాతివివక్షపై జరిగిన పోరాటానికి నువ్వెలా మద్దతు ప్రలికావు నాన్నా.. అని నా కూతురు ఎప్పుడైనా అడిగితే ఆమెకు గర్వంగా సమాధానం చెప్పగలగాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అంటూ ఒహానియన్ ఓ వీడియో సందేశంలో వివరించారు.

- Advertisement -