కోవిడ్-19 వ్యాక్సిన్‌పై రష్యా కీలక ప్రకటన

- Advertisement -

మాస్కో: కరోనాకు అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్‌పై రష్యా కీలక ప్రకటన చేసింది. మహమ్మారిని నిరోధించేందుకు రెడీ చేసిన వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షలను ప్రారంభించనున్నట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. మాస్కోకు చెందిన గమలేయ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసిన రెండు రకాల టీకాల (లిక్విడ్ అండ్ టీకా)ను రెండు గ్రూపులుగా విభజించి 38 మంది చొప్పున వలంటీర్లపై ప్రయోగించనున్నట్టు తెలిపింది.

వ్యాక్సిన్ భద్రత, సామర్థ్యాన్ని పరీక్షించేందుకు మిలటరీ సిబ్బంది, పౌరులను ఎంపిక చేసినట్టు పేర్కొంది. నేటి సాయంత్రానికి వీరద్దరికీ లిక్విడ్ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన అనంతరం 21 రోజులపాటు మాస్కోలోని ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచి పరీక్షించనున్నారు.

- Advertisement -

ఈ వ్యాక్సిన్ పరీక్షలకు 45 రోజుల సమయం పడుతుందని గమలేయసైంటిఫిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అంటువ్యాధుల విభాగం ప్రొఫెసర్ అలెంగ్జాండర్ గింట్స్‌బర్గ్ పేర్కొన్నారు. గత వారమే మిగతా పరిశోధకులపై వ్యాక్సిన్ ప్రయోగించామని, ఎవరిపైనా ఎలాంటి దుష్ఫ్రభావాలు కనిపించలేదని వివరించారు.

- Advertisement -