శ్రీలంక కీలక నిర్ణయం! బుర్ఖాపై నిషేధం!

1:34 pm, Mon, 29 April 19
Sri Lanka Updates News, Sri Lanka Bomb Blast News, Newsxpressonline

కొలంబో: శ్రీలంకలో ఈస్టర్ రోజు జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 321 మంది చనిపోగా సుమారు 500 మంది గాయపడ్డారు. అయితే ఈ ఉదంతం అనంతరం శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఎవరూ బుర్ఖా ధరించవద్దని ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ఇవి సోమవారం నుంచి అమలులోకి రానున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

దేశంలో చట్ట విరుద్ద చర్యల్ని అడ్డుకునేందుకు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఈ నిర్ణయం తీసుకున్నారు. సైనిక బలగాలకు తనిఖీకి అనుగుణంగా ఉండి నింధితులను త్వరితంగా గుర్తించేందుకే బుర్ఖాపై నిషేధం నిర్ణయం తీసుకున్నారు అని అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.

ఈ నిర్ణయాన్ని ముస్లిం నేతలు కూడా అంగీకరించారు. 1990ల్లో జరిగిన గల్ఫ్ యుద్ధం వరకు శ్రీలంకలో బుర్ఖా ధరించడమనేది సంప్రదాయం కాదు. ఈ యుధ్దం అనంతరం జరిగిన కొన్ని పరిణామాల వల్లే బుర్ఖా అనేది ప్రవేశించింది. ఇప్పటికీ చాలా మంది ముస్లీం మహిళలు బుర్ఖా ధరించడం లేదు అని అధ్యక్ష కార్యాలయం చెప్పుకొచ్చింది.

చదవండి:  శ్రీలంక బాంబు పేలుళ్లు: నిఘా హెచ్చరికలే అందలేదు.. నేనేం చేయగలను: ప్రధాని విక్రమసింఘే