సంచలనం: స్వలింగ వివాహాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తైవాన్

9:30 am, Sat, 18 May 19

తైవాన్: తైవాన్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. రెండేళ్లుగా నలుగుతున్న స్వలింగ సంపర్కుల వివాహాలకు సంబంధించిన బిల్లుకి ఆమోదం లభించింది. దీంతో స్వలింగ సంపర్కుల వివాహం చేసుకోవడానికి తైవాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ నిర్ణయంతో స్వలింగ సంపర్కుల వివాహాలకు అనుమతినిచ్చిన తొలి ఆసియా దేశంగా తైవాన్ నిలిచింది. ఇక దీనికి సంబంధించిన బిల్లును ఆ దేశ పార్లమెంట్ శుక్రవారం ఆమోదించింది.

చదవండి: జూలై 4 నుంచి ‘తానా’ మహాసభలు.. ట్రంప్, చంద్రబాబు, కేసీఆర్‌కు ఆహ్వానం!

ఈ బిల్లు ఆమోదం పొందడం వల్ల ఆ దేశంలో ఇకపై ఇద్దరు స్త్రీలు లేదా ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్లు వీధుల్లోకి వచ్చి కేరింతలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అయితే స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి దేశంగా డెన్మార్క్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నార్వే, స్వీడన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోనూ స్వలింగ వివాహాలు చట్టబద్ధమే. ఇక ఇప్పుడు వాటి సరసన తైవాన్ చేరింది.

చదవండి: రకుల్ కి షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్