షాకింగ్: ట్విట్టర్, ఫేస్‌బుక్, ఆల్ఫాబెట్ సీఈవోల జీతమెంతో తెలుసా?

7:32 pm, Tue, 9 April 19
jack-dorsey-mark-zuckerberg-larry-page

వాషింగ్టన్: ట్విట్టర్ గురించి తెలుసు కదా? మరి ఈ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) జాక్ డోర్సీ జీతమెంతో తెలుసా? వింటే షాక్ తింటారు. డోర్సీ నెల జీతం రూ.97. ఈ జీతం తప్ప ఆయన మరే రూపంలోనూ ఒక్క రూపాయి కూడా తీసుకోడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం!

ఆ మాటకొస్తే.. ట్విట్టర్ సీఈవో మాత్రమే కాదు.. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ నెల జీతం ఒక్క డాలర్ (రూ.69) మాత్రమే. మరో ఆశ్చర్యకరమైన విషయం.. గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ సీఈవో కూడా నెలకు ఒక డాలర్ (రూ.69) జీతంగా పుచ్చుకుంటున్నారు?

ప్రపంచ కుబేరుల జాబితాలోని మొదటి పది స్థానాల్లో కనిపించే వీరు.. నెల జీతాలు ఇలా ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కాని విషయం.

మరోవైపు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఆల్ఫాబెట్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు ఏటా లక్షల నుంచి కోట్ల రూపాయల జీతాలు తీసుకుంటుండగా.. వాటిని విజయపథాన నడిపిస్తోన్న ఆయా సంస్థల సీఈవోలు మాత్రం రూ.100 లోపే నెలజీతంగా తీసుకోవడం ఆశ్చర్యమే.

ట్విటర్ సీఈఓ జాక్ డోర్సీ విషయానికొస్తే.. ఈయన 2018లో మొదటిసారిగా రూ.97 జీతం తీసుకున్నారట. 2015 నుంచి దాదాపు రూ.100లోపు జీతాన్నే జాక్ తీసుకుంటూ వస్తున్నారు. సంస్థ నిబంధనలకు కట్టుబడి, ట్విటర్‌ను మరింత బలోపేతం చేసేందుకే తాను జీతం తీసుకుంటున్నాను తప్ప నేరుగా వచ్చే ఇతరత్రా పరిహారాలను, ప్రయోజనాలను కూడా తీసుకోనని జాక్ తెలిపారు.

షేర్ల విలువ మాత్రం వేల కోట్లు…

అయితే ట్విటర్ కంపెనీలో జాక్ డోర్సీకి 20 శాతానికిపైగా షేర్లు ఉన్నాయి. వీటి విలువ మాత్రం ఏటా పెరుగుతూనే వస్తోంది. ఈ షేర్ల విలువ మాత్రం ప్రస్తుతం కొన్ని వేల కోట్లు ఉంటుంది.

ఇక ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ కూడా ఎన్నో ఏళ్లుగా.. నెలకు కేవలం ఒక డాలర్ మాత్రమే జీతంగా తీసుకుంటూ వస్తున్నాడు. అలాగే గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫబెట్ సీఈఓ ల్యారీ పేజ్ జీతం కూడా ఏడాదికి ఒక డాలర్ మాత్రమే.