కరోనా వ్యాక్సిన్: కోతుల్లో సత్ఫలితాలు ఇస్తోన్న టీకా.. చిగురిస్తోన్న ఆశలు!

whole world hopes on rhesus monkeys
- Advertisement -

వాషింగ్టన్: కరోనా వైరస్ నివారణ కోసం అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్‌కి సంబంధించి ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ వైద్యులు జరుపుతున్న క్లినికల్ ట్రయల్స్ సత్ఫలితాలనిస్తున్నాయి.

దీంతో ఈ తరహా ప్రయోగాలపై ఆశలు చిగురిస్తున్నాయి. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా రీసెస్ జాతికి సంబంధించిన ఆరు కోతులపై వైద్యులు ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.

వారు తయారు చేసిన టీకాను ఈ కోతులపై ప్రయోగించగా అవి తమ శరీరంలోకి ప్రవేశించిన కరోనా వైరస్‌ను నిలువరించగలిగాయి.

చదవండి: హైదరాబాద్‌లో పోలీసులపై వలస కూలీల దాడి.. ఉద్రిక్తత

ఈ టీకా ప్రయోగం అమెరికాలోని మాన్టానలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రయోగశాలలో జరిగినట్లు తాజాగా ‘న్యూయార్క్ టైమ్స్’ ఓ కథనంలో పేర్కొంది.

ఈ కోతుల జన్యు క్రమానికి, మానవుల జన్యు క్రమానికి 93 శాతం వరకూ పోలికలు ఉండటంతో, ఇప్పుడు ఇదే టీకాను మనుషులపైనా ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు.

ఈ జాతి మనదేశంలోనూ ఉంది…

రీసెస్ జాతి కోతులు సాధారణంగా ఆసియా ఖండంలో అధికం. మన ఇండియాలోని ప్రతి ఊరిలోనూ సాధారణంగా ఈ రకం కోతులు కనిపిస్తుంటాయి.

ఇప్పుడీ రకానికి చెందిన ఆరు కోతులు యావత్ మానవాళికి ఆశలు రేపుతున్నాయి. ఈ రీసెస్ జాతి కోతులపై టీకా ప్రయోగాలు మార్చిలోనే ఆరంభమయ్యాయి.

మొత్తం 12 ఆరోగ్యవంతమైన కోతులను ఎంపిక చేసిన శాస్త్రవేత్తలు.. వాటిని రెండు జట్లుగా విభజించి, వేర్వేరుగా ఉంచారు.

ప్రయోగంలో భాగంగా ఆరు కోతుల శరీరంలోకి కరోనా వైరస్‌ను ప్రవేశపెట్టారు. మరో ఆరు కోతులకు తొలుత తాము రూపొందించిన టీకాను ఇచ్చి ఆ తరువాత వాటి శరీరంలోకి కరోనా వైరస్‌ను ప్రవేశపెట్టారు. 

టీకా ఇవ్వని కోతులు తీవ్ర అనారోగ్యం బారిన పడగా, టీకా తీసుకున్న కోతుల్లో 28 రోజుల తరువాత కూడా ఎలాంటి అనారోగ్య లక్షణాలూ కనిపించకపోవడం ఆక్స్‌ఫర్డ్ వైద్యులను ఆనందానికి గురిచేసింది.

ఇక జరగాల్సింది హ్యూమన్ ట్రయల్స్…

ఇక ఈ టీకాకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ మానవులపై జరగాల్సి ఉందని, టీకా తీసుకున్న వారు కరోనా వైరస్ బారిన పడకుండే ఉంటే తాము విజయం సాధించినట్లేనని వారు పేర్కొన్నారు. 

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ వైద్యులు నిర్వహిస్తున్న ప్రయోగాలు విజయవంతమైతే, ఆ వెంటనే ఆ టీకా తయారీకి మన దేశానికి చెందిన చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ సిద్ధంగా ఉంది.

శాస్త్రవేత్తలు విజయం సాధిస్తారన్న నమ్మకం ఉందని, అందుకే టీకా ప్రయోగాలు ముగిసేలోగానే, సాధ్యమైనంత సమయాన్ని ఆదా చేసేందుకు ‌ఉత్పత్తిని కూడా ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో అధర్ పూనావాలా వెల్లడించారు.

- Advertisement -