సార్వత్రిక ఎన్నికల సమరం: రేపు ఆరో దశ పోలింగ్.. 59 స్థానాలకి ఎన్నికలు

8:32 am, Sat, 11 May 19

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరం మరో కీలక ఘట్టానికి చేరుకుంది. ఇప్పటివరకు ఐదు దశలు పూర్తి చేసుకుని ఆరో దశ ఎన్నికలకి సర్వం సిద్ధమైంది. రేపు ఆరోదశలో 59 లోక్‌సభ స్థానాలకి ఎన్నికలు జరగనున్నాయి.

ఇందులో 10 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయబోతున్నారు. 6 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో 59 స్థానాలకు పోలింగ్‌ జరగబోతోంది. మొత్తం 979 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ దశలో బీహార్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, హర్యానా రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి.

చదవండిప్రత్యర్దులకి గంబీర్ సవాల్! నిరూపిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటా?

ఉత్తరప్రదేశ్‌లో 14, హర్యానాలో 10 , జార్ఖండ్‌లో 4, బీహార్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 8, , పశ్చిమ బెంగాల్‌లో 8, ఢిల్లీలోని మొత్తం 7 లోక్‌సభ స్థానాలకూ పోలింగ్ జరగబోతోంది. 59 స్థానాల్లో లక్షా 13 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఇక 59 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు…పలు ప్రాంతీయ పార్టీల నేతలు పోటీ పడుతున్నాడు. ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీపార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌లు హోరాహోరీగా తలపడుతున్నాయి.

చదవండికేజ్రీవాల్‌ని ఎందుకు కొట్టానో నాకే అర్ధం కావడం లేదు: సురేశ్