అయ్యో…బీజేపీ అభ్యర్ధి సన్నీ డియోల్‌కి ఆ విషయం కూడా తెలియదంటా…

8:59 am, Wed, 8 May 19

ఢిల్లీ: కశ్మీర్‌లోని పుల్వామాలో భారత మిలటరీ కాన్వాయ్‌పై జైషే మహమ్మద్ ఉగ్రదాడికి ప్రతీకారంగా.. భారత్ ఆర్మీ పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై వైమానిక దాడులు జరిపిన విషయం దేశంలో ప్రతి ఒక్కరికీ తెలుసు.

అయితే జైషే మహమ్మద్ ఉగ్రదాడిలో భారత సైనికులు 40 మంది చనిపోతే.. భారత వైమానిక దాడుల్లో వందల మంది ఉగ్రవాదులు చనిపోయినట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసింది. ఇక పాకిస్తాన్ అయితే భారత్ దాడిలో ఎవరూ చనిపోలేదని వెల్లడించింది.

చదవండిసంచలనం: చంద్రబాబు, కేసీఆర్, జగన్‌ యూపీఏకే మద్ధతిస్తారట….

ఈ విషయం పక్కనబెడితే….ఈ బాలాకోట్ దాడి గురించి బీజేపీ నేతలు, ప్రధాని మోడీ ఎన్నికల్లో ఓ ప్రచారం చేసేసుకుంటున్నారు.

అసలు గతంలో భారత్‌పై ఎన్ని ఉగ్రదాడులు జరిగినా…ఎప్పుడు ప్రతిదాడులు జరగలేదని చెబుతూనే….తమ హయాంలోనే పాక్‌కి బుద్ధి చెప్పమని, వారి దాడులని తిప్పికొట్టి….సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదులని మట్టుబెట్టమని చెప్పుకుంటున్నారు.

సన్నీకి బాలాకోట్ దాడులు గురించి తెలియదంటా..

ఇక బాలాకోట్ దాడులు గురించి బీజేపీ నేతలు ఓ రేంజ్‌లో ప్రచారం చేసుకుంటున్నా…. ఇటీవలే బీజేపీలో చేరిన బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్‌కు మాత్రం ఆ వైమానిక దాడుల గురించి అంతగా తెలియదని చెప్పారు.

సన్నీ పంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ….పై వ్యాఖ్యలు చేశారు.

ఇక తనకు బాలాకోట్ దాడుల గురించి గానీ.. భారత్-పాక్ సంబంధాల గురించి గానీ అంతగా తెలియదని చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికల్లో గెలిచి దేశానికి సేవ చేయాలనుకుంటున్నానని అన్నారు.

చదవండి:  ఇండియా టుడే-పీఎస్‌ఈ పోల్ సర్వే: ప్రధానిగా మోడీ వైపే మొగ్గు! రాహుల్ ‘న్యాయ్’కూ అమిత…