వైసీపీ అభ్యర్ధులే ఎక్కువ చదువుకున్నవారు….

YCP Candidates Latest News, YS Jagan Updates, AP Political News ,Newsexpressonline
- Advertisement -

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. మరో ఆరు రోజుల్లో అనగా మే19న చివరి దశ పోలింగ్ జరగనుంది. ఇక మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధుల్లో చాలామంది నేతలు నేర చరిత కలిగిన వారు ఉన్నారు. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పలుమార్లు వెల్లడించింది.

ఈ నేపథ్యంలో ఇండియా టుడే గ్రూప్ ఇంటలిజెన్స్ యూనిట్ ఓ ఆసక్తికరమైన సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు లోక్‌సభకి నిలబెట్టిన అభ్యర్థుల చదువు, అర్హతలను సర్వే చేసింది.

చదవండి: పెళ్ళిలో ఎన్నికల ఫలితాలు లైవ్ చూడొచ్చట…!

వైసీపీ టాప్…

ఈ సర్వే ప్రకారం ఏపీ ప్రతిపక్ష నేత జగన్ నేతృత్వంలోని వైసీపీ దేశంలోనే తొలిస్థానంలో నిలిచినట్లు తెలిపింది. మొత్తం 88 శాతం మంది డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదివిన అభ్యర్ధులు వైసీపీ తరుపున లోక్ సభ ఎన్నికల్లో పోటీచేశారు.

ఇక ఈ జాబితాలో తమిళనాడుకు చెందిన డీఎంకే 87.5 శాతంతో రెండో స్థానంలో నిలవగా, అన్నాడీఎంకే 86.4 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచింది. అటు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ 82.4 శాతంతో  నాలుగో స్థానంలో ఉంది.

అలాగే ఈ జాబితాలో నామ్ తమిళర్ కట్చి(80 శాతం), సీపీఎం(78 శాతం), కాంగ్రెస్(76 శాతం), తృణమూల్ కాంగ్రెస్(75 శాతం) బీజేపీ(71 శాతం) పార్టీలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక ఉన్నత చదువు చదివిన అభ్యర్ధుల్లో శ్రీకాకుళం టీడీపీ ఎంపీ అభ్యర్ధి రామ్మోహన్ నాయుడు మొదటిస్థానంలో నిలిచారు.

చదవండి: అక్కడ టీడీపీ గెలుపు నల్లేరు మీద నడకేనట…!
- Advertisement -