కొనసాగుతున్న ఐదో దశ పోలింగ్…అదృష్టం పరీక్షించుకొనున్న రాహుల్, రాజనాథ్, సోనియా…

8:30 am, Mon, 6 May 19
Lok Sabha Election 2019 Fifth Phase Voting

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు 51 లోక్‌సభ స్థానాల్లో ఐదో దశ పోలింగ్ కొనసాగుతుంది. ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.

ఇక ఈ ఎన్నికల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీలు అమేథి నుంచి ప్రత్యర్ధులుగా తలపడుతున్నారు.

వీరితో పాటు జార్ఖండ్‌ మాజీ సీఎం అర్జున్‌ ముండా, జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, ప్రముఖ క్రీడాకారిణి కృష్ణపునియాలు పోటీ చేసే నియోజకవర్గాలు కూడా నేటి పోలింగ్‌లో ఉన్నాయి.

ఇక ఇప్పటికి దేశ వ్యాప్తంగా నాలుగు దశల్లో 373 నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. నేడు జరిగే 51 స్థానాలకి కూడా కలుపుకుంటే మొత్తం 424 నియోజకవర్గాలు పూర్తవుతాయి. ఇక  మిగిలిన 118 స్థానాలకు ఆరు దశ మే 12, ఏడు దశ మే 19న ఎన్నికల జరగనున్నాయి. మే 23న మొత్తం ఫలితాలు వెలువడనున్నాయి.

చదవండి:సర్వేలన్నీ టీడీపీకే అనుకూలం.. గెలుపుపై సందేహాలు వద్దు: టీడీపీ శ్రేణులతో చంద్రబాబు