లోక్ సభ ఎన్నికల ఫలితాలు 2019: దూసుకెళుతున్న ఎన్డీయే.. అత్యధిక స్థానాల్లో ఆధిక్యం…

8:30 am, Thu, 23 May 19

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి దూసుకెళుతుంది. దేశవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 124 లోక్ సభ స్థానాల్లో లీడ్ లో ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 51 చోట్ల లీడ్ లో ఉన్నారు.

అలాగే ఇతరులు 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. రాజస్థాన్ లో బీజేపీ హవా చూపిస్తోంది. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ కొద్ది నిమిషాల క్రితం ప్రారంభమైంది. వీటిల్లో టీడీపీ, వైసీపీలు చెరో ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. అటు తెలంగాణలో టీఆర్ఎస్ 5 పార్లమెంట్ స్థానాల్లో, కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.