అభ్యర్ధులపై కేసులు: అలాంటి వాటినే రెడ్ అలెర్ట్ నియోజకవర్గాలు అంటారా?

10:54 am, Thu, 9 May 19

ఢిల్లీ: ఈరోజుల్లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఎక్కువ శాతం ఏదొక పోలీసు కేసులో ఉంటున్నారు. కనీసం ఒక నియోజకవర్గంలో ఒకరైనా ఉంటున్నారు. అయితే ఒక స్థానంలో పోటీ చేసే ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ అభ్యర్ధులపై క్రిమినల్ కేసులు ఉంటే వాటిని రెడ్ అలెర్ట్ నియోజకవర్గాలు అంటారు.

తాజాగా మే12న జరగబోయే ఆరో దశ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల నేరచరిత వివరాలని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ ఫార్మ్స్‌ సంస్థ వెల్లడించింది. ఆరో దశలో మొత్తం 7 రాష్ట్రాల్లో 59 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిల్లో 34 స్థానాలు రెడ్ అలెర్ట్ జోన్‌లో ఉన్నాయి.

చదవండి: అయ్యో…బీజేపీ అభ్యర్ధి సన్నీ డియోల్‌కి ఆ విషయం కూడా తెలియదంటా…

బీజేపీ-కాంగ్రెస్ అభ్యర్ధులు

ఇక మొత్తం పోటీ చేస్తున్న 967 మంది అభ్యర్థుల్లో 190 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాళ్లలో 48 శాతం మంది బీజేపీ అభ్యర్థులే. కాంగ్రెస్‌ అభ్యర్ధుల్లో 44 శాతం మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఈ ఆరో దశలో బీజేపీ నుంచీ 54 మంది పోటీ చేస్తుండగా వాళ్లలో 26 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. అలాగే, కాంగ్రెస్‌ తరపున బరిలో దిగిన 46 మందిలో 20 మందిపై కేసులున్నాయి. అటు బీఎస్పీ అభ్యర్థులు 49 మందిలో 19 మందిపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఏ‌డి‌ఆర్ తెలిపింది.

చదవండిమోడీపై విమర్శలు: ప్రియాంక, మమతలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సుష్మా