నిజమా? అబద్ధమా?: రాయ్‌బరేలీ ఎమ్మెల్యేతో రాహుల్‌ గాంధీ పెళ్లి!

- Advertisement -

రాయ్‌బరేలీ: కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వివాహం ఖరారైందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. సొంత పార్టీకే చెందిన రాయ్‌బరేలీ ఎమ్మెల్యే అదితి సింగ్‌, రాహుల్‌ల పెళ్లికి ఇరుకుటుంబాలు అంగీకరించాయని, మే నెలలోనే పెళ్లి తంతు పూర్తవుతుందని ఈ వార్తల సారాంశం.  మరికొద్ది రోజుల్లో కీలకమైన కర్ణాటక ఎన్నికల పోలింగ్‌ ఉండడంతో రాజకీయం వర్గాల్లోనూ ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.

ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో 29 ఏళ్ల అదితి సింగ్‌ది ప్రత్యేక స్థానం. అమెరికాలోని డ్యూక్‌ యూనివర్సిటీలో మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ పూర్తిచేసిన ఆమె అనూహ్యంగా రాజకీయ రంగప్రవేశం చేశారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కంచుకోట రాయ్‌బరేలీ నుంచి 90 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే అదితి.. రాహుల్‌ సోదరి ప్రియాంకతో చాలా సన్నిహితంగా మెలుగుతారు. రాయ్‌బరేలి స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అఖిలేశ్‌ సింగ్‌ కూతురే అదితి సింగ్‌.

- Advertisement -

అయితే ఈ పెళ్లి పుకార్లపై రాయ్‌బరేలీ ఎమ్మెల్యే అదితి మాత్టురం ఘాటుగా స్పందించారు.  ‘‘రాహుల్‌ గాంధీ నాకు పెద్దన్నలాంటి వారు. రాఖీ కూడా కడతాను. అలాంటిది మా ఇద్దరికీ పెళ్లా? అసలు ఇలాంటి ప్రచారం సాగడం నిజంగా బాధాకరం. సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారం చూసినప్పుడు మనసుకు కష్టంగా అనిపిస్తుంది..’’ అని ఎమ్మెల్యే అదితి సింగ్‌ మీడియాతో అన్నారు.

- Advertisement -