కర్ణాటకలో నేడు కరోనా బారినపడిన 1502 మంది

- Advertisement -

బెంగళూరు: కర్ణాటకలో కరోనా విలయం కొనసాగుతోంది. నేడు కొత్తగా 1,502 మంది కరోనా బారినపడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 18 వేల మార్కును దాటేసింది. కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో జనం భయంతో హడలిపోతున్నారు.

కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 18,016కు పెరిగింది. అలాగే నేడు కొత్తగా 19 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 272 మందికి చేరింది.

- Advertisement -

రాష్ట్రంలో ఇంకా 9,406 మంది కరోనాతో పోరాడుతూ వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. 8,334 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

- Advertisement -