ఈ రోజు ఒక్కరోజే 1875 కేసులు.. తమిళనాడులో కరోనా కల్లోలం

- Advertisement -

తమిళనాడులో ఈ మధ్య కాలంలో ఎన్నడూ నమోదు కాని స్థాయిలో పాజిటివ్ కేసులు నేడు రాష్ట్రంలో నమోదయ్యాయి.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దాదాపు 1800పైగా బాధితులను ఒక్కరోజులో గుర్తించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -

తాజాగా నమోదైన కేసుల వివరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఓ నివేదిక విడుదల చేసింది.

దాని ప్రకారం.. గత 24 గంటల్లో 1,875 కోవిడ్-19 పాజిటివ్ కేసులు రాష్ట్రంలో నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

అంతేకాకుండా 23 మంది తాజాగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య 38,716కు చేరింది.

వీరిలో 17,659 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 20,705 మంది డిశ్చార్జ్ అయ్యారు. 349మంది ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -