రోజూ 200 నాన్ ఏసీ రైళ్లు.. త్వరలోనే ఆన్‌లైన్‌లో టిక్కెట్ల బుకింగ్.. రైళ్ల జాబితా ఇదే…

12:34 am, Thu, 21 May 20
200 non ac trains daily from June 1 tickets will be available on online

న్యూఢిల్లీ: జూన్ 1 నుంచి ప్రతిరోజూ 200 నాన్ ఏసీ రైళ్లను నడపనున్నట్లు భారతీయ రైల్వే తెలియజేసింది. ఈ రైళ్లకు సంబంధించిన టిక్కెట్ల బుకింగ్ త్వరలోనే మొదలవుతుంది. 

చిన్న నగరాలు, పట్టణాల ప్రయాణికుల అవసరాలను ఈ రైళ్లు తీర్చుతాయని, ఇవి రాకపోకలు సాగించే మార్గాలు, వేళలను త్వరలోనే వెల్లడించనున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది.

చదవండి: అర్థరాత్రి నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపై రాకపోకలు షురూ, కర్ఫ్యూ వేళల్లో మాత్రం కార్లకు ‘నో’…

అయితే ఈ రైళ్లకు సంబంధించిన టిక్కెట్లను రైల్వే స్టేషన్లలో విక్రయించరు. ప్రయాణికులు ఆన్‌లైన్‌లో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవలసి ఉంటుంది.

ఇప్పటికే దేశ రాజధాని నగరం ఢిల్లీ నుంచి శ్రామిక్ రైళ్లతోపాటు దేశంలోని 15 గమ్యస్థానాలకు 30 జతల ప్రత్యేక ఏసీ రైళ్లను కూడా రైల్వే శాఖ నడుపుతోంది.

అంతేకాదు, ఈ శ్రామిక్ రైళ్లను రెట్టింపు చేశామని, మంగళవారం రాత్రి నుంచే 200 శ్రామిక్ రైళ్లను నడుపుతున్నట్లు కూడా ఆ శాఖ పేర్కొంది.

రైళ్ల జాబితా కోసం కింద ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి…

200-non-ac-trains-list