గల్వాన్ లోయలో చైనాతో ఘర్షణలో.. 23 మంది భారత సైనికుల వీరమరణం?

11:49 pm, Tue, 16 June 20

న్యూఢిల్లీ: లడక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా-భారత్ బలగాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సమయంలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందినట్లు తెలుస్తోంది.

కల్నల్ సంతోష్‌తో పాటు మరో ఇద్దరు జవాన్లు మాత్రమే మరణించినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే మొత్తమ్మీద 20 మంది భారత జవాన్లు చనిపోయినట్లు కొందరు అధికారులు చెప్తున్నారు.

ఇక్కడ ఎలాంటి కాల్పులు జరగలేదని.. కేవలం బాహాబాహీ, పిడిగుద్దులు, రాళ్లతో కొట్టుకోవడం వల్లనే ఈ మరణాలు సంభవించాయని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

అటు చైనా వైపు 43 మంది సైనికులు చనిపోయినట్లు సమాచారం. చైనా కూడా ఈ మరణాలపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.