జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం.. ఒకరు లొంగుబాటు

- Advertisement -

షోపియాన్‌: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా కిలూరా ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో శుక్రవారం ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా, మరొకరు లొంగిపోయారు. 

కిలూరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఈ ఉదయం  గాలింపు చేపట్టాయి.

- Advertisement -

ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరొకరు లొంగిపోయారు.

ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

- Advertisement -