లాక్‌డౌన్ సడలింపును సవాల్ చేసిన న్యాయ విద్యార్థి.. ఫైన్ వేసిన కోర్టు

- Advertisement -

‘లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడం వల్ల దేశంలో కరోనా విజృంభిస్తోంది.

ప్రతి రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది’ అంటూ ఓ న్యాయ విద్యార్థి ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. 

- Advertisement -

అయితే ఈ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్నే సమర్థించింది.

కేంద్రం ఈ నిర్ణయాన్ని ఏ మాత్రం తొందరపాటుతో తీసుకోలేదని స్పష్టం చేసింది.

కరోనాను కట్టడి చేయడమే కాకుండా దేశంలో ఆకలి మరణాలు సంభవించకుండా ఉండేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది.

అంతేకాకుండా సరైన ఆలోచన లేకుండా పిటిషన్ వేసినందుకు పిటిషనరైన న్యాయ విద్యార్థికి రూ.20వేలు జరిమానా విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది.

దేశంలో జూన్ 1 నుంచి లాక్‌డౌన్ నిబంధనలను కొంతమేరకు సడలిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. షాపులు, మాల్స్, పలు దుకాణాలు, రవాణా వ్యవస్థలను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -