ఢిల్లీలో కరోనా కల్లోలం.. ఆప్ ఎమ్మెల్యే అతిషి, పార్టీ ప్రతినిధి అక్షయ్‌లకు కరోనా

- Advertisement -

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నా వైరస్ విజృంభణ మాత్రం ఆగడం లేదు.

తాజాగా అధికారపార్టీలో ఇద్దరు కరోనా వైరస్ బారినపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అతిషి, పార్టీ ప్రతినిధి అక్షయ్ మరాఠేలకు కరోనా సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. దీంతో మహమ్మారి బారినపడిన ఎమ్మెల్యేల సంఖ్య 4కు పెరిగింది.

అతిషి దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గం నుంచి అతిషి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేతోపాటు ఆప్ ప్రతినిధి అక్షయ్ మరాఠేలకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది.

ప్రస్తుతం వీరిద్దరూ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వీరితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అతిషి ముఖ్య పాత్ర పోషిస్తున్నారని, ఆమె త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యవంతురాలిగా తిరిగి వస్తారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

కాగా, విశేష్ రవి, రాజ్‌కుమార్ ఆనంద్ అనే ఎమ్మెల్యేలు ఇప్పటికే కరోనా బారినపడ్డారు.

- Advertisement -