రూ.1,299కే విమాన టికెట్! విస్తారా నుంచి ‘ఫ్లాష్‌ సేల్’.. ఆఫర్ ఈ అర్ధరాత్రి వరకే!!

- Advertisement -

ముంబై: మాన్‌సూన్ సీజన్ మొదలైందో లేదో అప్పుడు పలు విమానయాన సంస్థలు దేశీయ ప్రయాణాలకు సంబంధించి ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి.  బడ్జెట్ క్యారియర్ గో ఎయిర్ ‘స్పెషల్ మాన్‌సూన్ ఆఫర్’ ప్రకటించి ఒక రోజు గడిచిందో లేదో విస్తారా కూడా 24 గంటల ‘ఫ్లాష్ సేల్’ ప్రకటించింది.  మరోవైపు ఎయిర్ ఏషియా కూడా తక్కువ ధరకే విమాన టికెట్లు ఆఫర్ చేస్తోంది.

విస్తారా ఎయిర్ లైన్స్ మంగళవారం భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా 75 శాతం వరకు తగ్గింపు ధరలతో టికెట్లు విక్రయించనున్నట్లు వెల్లడించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం అర్ధరాత్రి వరకు, కేవలం 24 గంటలపాటు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద కొనుగోలు చేసిన టికెట్ల ద్వారా జూన్‌ 21 నుంచి సెప్టెంబర్‌ 27 మధ్యలో ప్రయాణించేందుకు వీలుంటుంది.  విస్తారా ప్రస్తుతం 22 దేశీయ మార్గాల్లో వారానికి 800 విమాన సర్వీసులను నిర్వహిస్తోంది.

- Advertisement -

సాధారణ చార్జీలపై మార్గాన్ని బట్టి 75 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. రూ.1,299 నుంచి చార్జీలు ప్రారంభమవుతాయి. హైదరాబాద్-ఢిల్లీ మార్గంలో అయితే టికెట్ ధర రూ.2,199. టికెట్ చార్జీకి అదనంగా ఇంధన సర్ చార్జీ, పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.  ఇక ఢిల్లీ-లక్నో వంటి స్వల్ప దూర మార్గాల టికెట్‌లు కేవలం రూ.1,599కే (అన్నీ కలిపి) లభించనున్నాయి. ఢిల్లీ-హైదరాబాద్‌, ఢిల్లీ-రాంచీ వంటి లాంగ్‌ రూట్‌ టికెట్‌ ధరలను సంస్థ రూ.2,299గా నిర్ణయించింది. కోల్‌కతా-పోర్ట్‌బ్లెయిర్‌ టికెట్‌పై రూ. 2,499, ఢిల్లీ నుంచి గోవాకు రూ.2,799 చార్జ్‌ చేయనుంది.

ఎయిర్ ఏషియా నుంచి…

వర్షాకాలం కావడంతో ఆఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని సాధారణంగా విమానయాన సంస్థలు డిస్కౌంట్ ఆఫర్లను ఇస్తుంటాయి. మరో విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా అయితే, రూ.1,399 నుంచి టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఈ నెల 10 వరకు టికెట్ల బుకింగ్‌కు అవకాశం ఉంది.

- Advertisement -