సినిమాల్లో డిమాండ్ లేకనే రాజకీయాల్లోకి: కమల్‌పై అన్నాడీఎంకే మంత్రి సెటైర్లు…

10:15 am, Tue, 7 May 19
aiadmk minster slams kamal hasan

చెన్నై: తమిళ్ స్టార్ హీరో కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పేరిట రాజకీయ పార్టీని స్థాపించి…లోక్‌సభ ఎన్నికల బరిలో దిగిన విషయం తెలిసిందే. తమిళనాడులోని పార్లమెంట్ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్ధులని కమల్ బరిలో దించారు.

ఈ నేపథ్యంలోనే కమల్‌పై అన్నాడీఎంకే  మంత్రి రాజేంద్ర బాలాజీ సెటైర్లు వేశారు. ఒట్టపిడారం అన్నాడీఎంకే అభ్యర్థి మోహన్‌కు మద్దతుగా ప్రచారంలో భాగంగా రాజేంద్ర అన్నాడీఎంకే బూత్‌ ఏజెంట్లు, నిర్వాహకులతో సోమవారం సమావేశమయ్యారు.

చదవండి పవన్ కింగ్ అయినా.. కింగ్‌మేకర్ అయినా కావొచ్చంటున్న మాజీ నేత…

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాల్లో డిమాండ్ తగ్గడం వల్లే కమల్ రాజకీయాల్లోకి వచ్చారని ఎద్దేవా చేశారు. కమల్‌కి 65 ఏళ్ల తర్వాత కానీ రాజకీయ పరిజ్ఞానం రాలేదని, సినిమాల్లో ఇప్పటి వరకు బాగా ఎంజాయ్ చేశారని, ఇప్పుడు మార్కెట్ లేకపోవడంతో రాజకీయాలవైపు వచ్చారని అన్నారు.

అయితే సినీ నటులు ఎవరొచ్చినా జనం చూసేందుకు ఎగబడతారని, అసలు కమెడియన్ వడివేలు వచ్చినా అంతే జనం వస్తారని అన్నారు. అలా అని కమల్‌ను చూసేందుకు వస్తున్న జనం ఓట్లు మాత్రం వేయరని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు అన్నాడీఎంకే అభ్యర్ధులని గెలిపించుకునేందుకు సిద్ధమయ్యారని, రాష్ట్రంలో మెజారిటీ లోక్‌సభ సీట్లు సాధిస్తామని రాజేంద్ర విశ్వాసం వ్యక్తం చేశారు.

చదవండి: ఫెడరల్ ఫ్రంట్: 13న స్టాలిన్‌తో భేటీ కానున్న కేసీఆర్…