జియోకి షాకిచ్చిన ఎయిర్‌టెల్! కొత్త రూ.148 ప్రీపెయిడ్ ప్లాన్ అదుర్స్!

7:54 pm, Sun, 7 July 19
airtel-4g-prepaid-new-plan

న్యూఢిల్లీ: టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే ఎయిర్‌టెల్ ఓ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌తో తాజాగా జియోకి షాక్ ఇచ్చింది. ఇటీవలే రూ.1,699 దీర్ఘకాలిక ప్రిపెయిడ్ ప్లాన్‌‌ను సవరించిన ఎయిర్‌టెల్ ఇప్పుడు మరో చౌక ధర ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఆవిష్కరించి జియోకు సవాల్ విసిరింది.

రిలయన్స్ జియో రూ.149 ప్రిపెయిడ్ ప్లాన్‌ రోజుకు 1.5 జీబీ డేటా అందిస్తోంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్ సదుపాయంతోపాటు ఎస్సెమ్మెస్‌లు కూడా అపరిమితం. ఇంకా జియో టీవీ, జియో సినిమా వంటి జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. ప్లాన్ వాలిడిటీ 28 రోజులు.

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ తాజా ప్లాన్ ఇదీ…

ఎయిర్‌టెల్ రూ.148 రీచార్జ్ ప్లాన్‌లో.. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తోపాటు రోజుకు 3 జీబీ హైస్పీడ్ డేటాను ఆఫర్ చేస్తోంది. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు కూడా లభిస్తాయి. ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. అలాగే ఎయిర్‌టెల్ టీవీ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా పొందొచ్చు. ఇందులో 350కిపైగా లైవ్ టీవీ ఛానళ్లను చూడొచ్చు. ఇంకా వింక్ మ్యూజిక్ యాప్‌ యాక్సెస్ కూడా లభిస్తుంది.

అయితే ఈ టారిఫ్ వార్‌లో భాగంగా.. మరో టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన వొడాఫోన్ కూడా ఇప్పటికే ఓ చౌకైన రీచార్జ్ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. వొడాఫోన్ రూ.139 ప్రిపెయిడ్ ప్లాన్‌లో కూడా అపరిమిత కాల్స్‌తోపాటు 3 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 28 రోజులు. ఇంకా 100 ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. అలాగే వినియోగదారులకు వొడాఫోన్ ప్లే యాప్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.