అమెజాన్‌లో అతడికి బంపర్ ఆఫర్.. రూ.300 పెడితే రూ.19000 గిఫ్ట్

- Advertisement -

ఐఫోన్ బుక్ చేస్తే రాళ్లు, సబ్బులు రావడం, లేదా వేరే ఏదో రావడం, ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు అనేకం వెలుగులోకి వచ్చేవి.

ఇప్పుడు కూడా అడపాదడపా ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

- Advertisement -

దీంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ సంస్థల్లో ఏదైనా కొంటే అది చేతికందే దాకా టెన్షనే. ఎప్పుడు చేతికొస్తుందా అనే టెన్షన్ ఉండేది.

మరో వైపు ఆ వస్తువే వస్తుందో, లేక ఇంకేదైనా వస్తుందోనని చాలా మంది తెగ హైరానా పడిపోతుంటారు.

 పూణేకు చెందిన ఓ వ్యక్తికి కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది. అయితే దీనికి అతడు బాధపడడం బదులు తెగ సంబర పడిపోతున్నాడు.

కారణం ఏంటనుకుంటున్నారా..? అయితే ఇది చదవండి.. పూణేకు చెందిన గౌతం రేజే అనే వ్యక్తి అమెజాన్‌లో రూ.300 విలువైన స్కిన్ లోషన్ ఒకటి బుక్ చేశాడు.

నిర్ణీత సమయానికి డెలివరీ వచ్చింది. తీరా బాక్స్ తెరిచి చూస్తే అందులో అక్షరాలా రూ.19,000 విలువైన బోస్ వైర్‌లెస్ ఇయర్ బడ్స్, ఓ కిలో సర్ఫ్ ప్యాకెట్ వచ్చాయి.

దీంతో ఆశ్చర్యానికి గురైన గౌతం ఈ విషయాన్ని అమెజాన్ దృష్టికి తీసుకెళ్లాడు. అయితే అక్కడి నుంచి కూడా అతడికి ఊహించని సమాధానం వచ్చింది.

గౌతం నిజాయతీకి మెచ్చిన అమెజాన్ వాటిని అతడికి గిఫ్ట్‌గా ఇచ్చేసింది. దీంతో గౌతం తెగ సంబరపడిపోతున్నాడు.

దీనికి సంబంధించిన వివరాలను గౌతం తన ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

అంతేకాకుండా స్కిన్‌లోషన్ పంపించనందుకు గానూ ముందుగా చెల్లించిన రూ.300 కూడా తిరిగి చెల్లించేసిందని గౌతం వివరించాడు.

ఇలా అనుకోకుండా ఏదైనా బహుమతి వస్తే మన చేతికొస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేము.

- Advertisement -