ఫెడరల్ ఫ్రంట్: కేసీఆర్-స్టాలిన్‌ల భేటీ లేనట్లేనా…!

7:52 am, Wed, 8 May 19

చెన్నై: కాంగ్రెస్, బీజేపీ పార్టీలకి ప్రత్యామ్నాయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసే భాగంలో….ఈ నెల 13న డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ని కలుస్తారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా కేసీఆర్-స్టాలిన్‌లు భేటీ ఉండదని తెలుస్తోంది. అయితే భేటీ జరగకపోవడానికి కారణాలు లేకపోలేదు. తమిళనాడులో నాలుగు అసెంబ్లీ స్థానాలకు 19న ఉప ఎన్నికలు జరగనున్నాయి.

చదవండి: సినిమాల్లో డిమాండ్ లేకనే రాజకీయాల్లోకి: కమల్‌పై అన్నాడీఎంకే మంత్రి సెటైర్లు…

డీఎంకె-కాంగ్రెస్ పొత్తు కారణమేనా

దీంతో ఆ ఎన్నికల ప్రచారంలో స్టాలిన్‌ బిజీగా ఉన్నారని డీఎంకే వర్గాలు తెలిపాయి. అందుకే, కేసీఆర్‌ను స్టాలిన్‌ కలవడం లేదని వివరించాయి. దీనికి తోడు ప్రస్తుతం డీఎంకే, కాంగ్రెస్‌ కూటమిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరిట మూడో కూటమి అవసరం లేదని స్టాలిన్‌ భావిస్తున్నట్లు కూడా డీఎంకే నేతలు చెబుతున్నారు.

తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్టాలిన్‌ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. పైగా కూటమి తరఫున కాబోయే ప్రధాన మంత్రి రాహుల్‌ గాంధీయేనని బహిరంగ సభలో ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఏర్పాటు అయ్యే ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చలు జరపడం సమంజసం కాదని డీఎంకే భావిస్తుంది.  అందుకే, కేసీఆర్‌తో భేటీకి నిరాకరించారని డీఎంకే వర్గాలు వివరించాయి.

చదవండిసంచలనం: చంద్రబాబు, కేసీఆర్, జగన్‌ యూపీఏకే మద్ధతిస్తారట….