విషాదం: లోయలో పడిన బస్సు.. 33 మంది మృతి

maharashtra-bus-accident
- Advertisement -

maharashtra-bus-accidentముంబై: విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది.  మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని అంబేనలి ఘాట్‌లో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడి 33 మంది మృతిచెందారు. వారాంతం కావడంతో కొంకణ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 33 మంది బస్సులో మహాబలేశ్వరం విహార యాత్రకు బయల్దేరారు. బస్సు పొలందపూర్‌కు చేరగానే అదుపుతప్పి లోయలో పడిపోయింది.

దాదాపు 800 అడుగుల లోతైన లోయలోకి పడటంతో బస్సు నుజ్జునుజ్జయ్యింది.  ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్, క్లీనర్‌తో పాటు 35 మంది ఉన్నారు. బస్సు ప్రమాద సమాచారం అందగానే పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరి సహాయక చర్యలు చేపట్టారు.  బస్సులో లోయలోకి పడక ముందే ఓ ప్రయాణికుడు బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ప్రమాదం సమయానికి ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ఆ వ్యక్తే జరిగిన ప్రమాదం గురించి స్థానికులకు తెలియజేశాడు.
విహారయాత్రకు బయలుదేరే ముందు తీసుకున్న గ్రూప్ ఫొటో
- Advertisement -