షాకింగ్: దసరా సంబరాల్లో అమ్మాయిలపై అల్లరిమూక దాడి.. 25 మందికి గాయాలు…

bihar
- Advertisement -

bihar1

పాట్నా: బీహార్‌లోని జహనాబాద్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. దసరా సంబంరాలకు వెళ్లిన మహిళలపై ఓ అల్లరిమూక బ్లేడులతో విచక్షణా రహితంగా దాడి చేసింది. దసరా వేడుకల్లో భాగంగా ఠాగూర్ బారి ప్రాంతంలో ఏటా నిర్వహించే తిరునాళ్లలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

- Advertisement -

ఈ దాడిలో  25 మందికి పైగా అమ్మాయిలు, మహిళలు గాయపడగా.. వారిలో 20 నుంచి 30 ఏళ్లలోపు వారే అధికంగా ఉండడం గమనార్హం. దాదాపు అందరికీ నడుము కింద భాగంలో గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావమైంది.

ఊహించని ఈ ఘటనతో మేళాకు వచ్చిన మహిళలు తీవ్ర భయాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మహిళలను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి వారికి చికిత్స అందించారు.

ఈ దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని జహనాబాద్ జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ ఘోష్, ఎస్పీ మనీశ్ కుమార్ పేర్కొన్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు. పోలీసులు ఈ విషయమై కేసు నమోదు చేపి విచారణ చేస్తున్నారు.

- Advertisement -