బీజేపీ, ఆరెస్సెస్ నేతలంతా గాడ్సే లవర్స్: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు…

4:22 pm, Fri, 17 May 19
rahul gandhi6

ఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సే నిజమైన దేశభక్తుడని బీజేపీ నాయకురాలు సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. అయితే సాధ్వీ వ్యాఖ్యలపై విపక్షాల నుంచే కాకుండా…సొంత పార్టీ బీజేపీ ఆగ్రహానికి గురైంది. అలాగే గాడ్సేని  ప్రశంసించడంపై దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ఆమె అలా అనడం తప్పు అని ఒప్పుకుంది. దేశ ప్రజలని క్షమించమని కోరింది. అయితే ఇంతటితో వివాదం సద్దుమణిగింది అనుకుంటే…ఈరోజు  కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే స్పందిస్తూ.. గాడ్సేపై ప్రస్తుతం చర్చ జరగడం తనకు చాలా సంతోషంగా ఉందని సెలవిచ్చారు.

ఇక ఈయనకి తోడుగా కర్ణాటక బీజేపీ నేత నలిన్ కుమార్ కతీల్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘గాడ్సే కేవలం ఒక్కరినే చంపారనీ, కానీ రాజీవ్ గాంధీ మాత్రం 17,000 మందిని చంపారు’ అని ట్వీట్ చేశారు.

చదవండి: ప్రలోభాలకు గురి చేయడానికే జూలై 5న ఎంపీపీ, జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక: ఉత్తమ్

అయితే వీరి వ్యాఖ్యలపై అన్నీ వైపులా నుంచి తీవ్రంగా వ్యతిరేకత రావడంతో తన ట్విట్టర్ హ్యాక్ కు గురయిందని హెగ్డే ప్రకటించగా, నలిన్ కుమార్ తన ట్వీట్‌ను వెంటనే తొలగించారు.

రాహుల్ సెటైర్లు

ఇక బీజేపీ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. బీజేపీ, ఆరెస్సెస్ నేతలు గాడ్‌ని ప్రేమించేవారు కాదనీ, వారంతా గాడ్సేని ప్రేమించేవారు అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

చదవండి: ఎవరు ఎన్ని రకాలుగా బెదిరించినా నేను బెదరను: కమల్