కోలుకుంటున్న లతామంగేష్కర్.. ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జ్

8:28 am, Tue, 12 November 19

ముంబై: తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయిని లతామంగేష్కర్ ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆమె సోదరి ఉషా మంగేష్కర్ తెలిపారు.

మీడియాతో ఆమె మాట్లాడుతూ..లతామంగేష్కర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, నేడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జవుతారని స్పష్టం చేశారు.

వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాస సంబంధ సమస్య రావడంతో లతామంగేష్కర్ నిన్న ఉదయం 2 గంటలకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఉష తెలిపారు.

లతామంగేష్కర్ సోదరి ఆశాభోంస్లే సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆసుపత్రికి చేరుకుని ఆమెను పరామర్శించారు.