వివాహానంతరం అత్తారింటికి వెళ్తూ నదిలో దూకేసిన నవ వధువు!

- Advertisement -

షియోపూర్(మధ్యప్రదేశ్): పెళ్లి తంతు ముగిసిన తర్వాత అత్తారింటికి కారులో వెళ్తూ నదిలోకి దూకేసిందో నవ వధువు. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో నిన్న జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌లోని అలపూర్‌కు చెందిన యువతికి ఆదివారం వివాహమైంది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత సాయంత్రం 7 అప్పగింతల కార్యక్రమం పూర్తయింది.

- Advertisement -

అనంతరం అత్తమామలతో కలిసి నవ వధువు కారులో షియోపూర్ బయలుదేరింది. కారు చంబల్ నదిపై ఉన్న పాళి వంతెనపై నుంచి వెళ్తుండగా తనకు వాంతి వస్తోందని, కారు ఆపాలని కారు డ్రైవర్‌ను కోరింది.

అందుకు అతడు నిరాకరించాడు. దీంతో ఆమె ఒక్కసారిగా స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకుంది. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే సడెన్ బ్రేకు వేశాడు.

ఆ వెంటనే కారు నుంచి బయటకు దిగిన నవ వధువు ఒక్కసారిగా బ్రిడ్జి పైనుంచి కిందికి దూకేసింది. సమాచారం అందుకున్న పోలీసులు నదిలో గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

- Advertisement -