టిక్ టాక్ బ్యాన్ వల్ల రోజుకు రూ. 4 కోట్ల నష్టం..!

- Advertisement -

తమిళనాడు: తమిళనాట మొదలైన టిక్ టాక్ బ్యాన్ ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా అమలు అయ్యింది. ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ చేయాల్సిందే అంటూ చెన్నై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు సమర్ధించిన నేపథ్యంలో కేంద్ర సమాచార శాఖ ఇప్పటికే గూగుల్ మరియు ఆపిల్ ప్లే స్టోర్స్ నుండి టిక్ టాక్ ను తొలగించడం జరిగింది.

ఇప్పటికే వాడుతున్న వారు కాకుండా కొత్తగా టిక్ టాక్ ను డౌన్ లోడ్ చేసుకోవాలనుకునే వారికి ప్లే స్టోర్ లో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టుకు టిట్ టాక్ సంస్థ విచారణ వినిపించింది. చైనాకు చెందిన టిక్ టాక్ కు ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇండియాలో 300 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్నారు. ప్రతి రోజు ఒక మిలియన్ చొప్పున డౌన్ లోడ్స్ ఉండేవట.

ఇప్పుడు టిక్ టాక్ ను బ్యాన్ చేసిన కారణంగా ఇండియాలో తీవ్ర నష్టాలను తాము ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని సంస్థ సుప్రీంకు విన్నవించింది. ప్రతి రోజు దాదాపు నాలుగు కోట్ల వరకు నష్టపోతున్నట్లుగా పేర్కొంది. ఇదే పరిస్థితి కొనసాగితే సంస్థకు చెందిన దాదాపు 275 మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉందని సంస్థ తరపు న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలియజేయడం జరిగింది.

అందుకే టిక్ టాక్ పై ఉన్న నిషేదంను ఎత్తి వేయాల్సిందిగా ఆయన కోరాడు. వాదనలు విన్న సుప్రీం కోర్టు నిషేదంను ఎత్తి వేసేందుకు మద్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. కేసును వాయిదా వేయడం జరిగింది. టిక్ టాక్ ను బ్యాన్ చేసినా కూడా ఇప్పటికే 300 మిలియన్ ల మంది డౌన్ లోడ్ చేసుకున్న నేపథ్యంలో సంస్థకు వచ్చే నష్టం ఏమీ లేదని టెక్ నిపుణులు చెబుతున్నారు. సంస్థ చెబుతున్న స్థాయిలో నష్టాలు రాకపోవచ్చు అని కూడా అంటున్నారు.

- Advertisement -