మరో మూడు రోజుల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. డిసెంబర్ 7 వరకు ‘ఎగ్జిట్ పోల్స్‌’పై ఈసీ నిషేధం…

Election_Commission
- Advertisement -

Election_Commission

న్యూఢిల్లీ: మరో మూడు రోజుల్లో.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ పై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. నవంబర్ 12వ తేదీ ఉదయం 7 గంటల నుంచి డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.

- Advertisement -

తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్‌ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.  ఛత్తీస్‌గఢ్‌లో ఈనెల 12న తొలి దశ పోలింగ్ జరగనుంది. మిగతా నాలుగు రాష్ట్రాలలో కూడా దశల వారీగా పోలింగ్ జరగనుంది.

డిసెంబర్  7వ తేదీన తెలంగాణ, రాజస్థాన్‌లో జరిగే ఎన్నికలతో ఐదు రాష్ట్రాల పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం వివిధ ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విడించింది

చదవండి:వీడిన ఉత్కంఠ: మోగిన ఎన్నికల నగారా, తెలంగాణలో డిసెంబర్ 7న పోలింగ్, 11న ఫలితాలు

తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ పై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది.

నవంబర్ 12వ తేదీ ఉదయం 7 గంటల నుంచి డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.

- Advertisement -