కరోనా వైరస్ జన్యుక్రమంలో మార్పులు.. మరింత భయపెట్టే అవకాశం!

- Advertisement -

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు సంబంధించి మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. వైరస్ జన్యక్రమంలో మార్పుల కారణంగా మనుషుల్లో ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం వైరస్‌లో మరింత పెరిగినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

కోవిడ్‌కు కారణమయ్యే సార్స్ కోవ్-2 వైరస్‌లో మార్పుల కారణంగా ‘డీ614జీ’ అనే కొత్త రకం వైరస్ పురుడు పోసుకుందని, దీనికి ఇన్ఫెక్షన్ కలిగించే లక్షణాలు మరింత అధికంగా ఉన్నట్టు పరీక్షల్లో తేలిందన్నారు.

- Advertisement -

నిజానికి దీనిని ఏప్రిల్ తొలి వారంలోనే గుర్తించినట్టు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ కొత్తరకం వైరస్ ప్రవేశిస్తే పరిస్థితి మొత్తం తారుమారు అవుతుందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన బెటో కోర్బర్ పేర్కొన్నారు.

ఈ వైరస్‌లో మార్పు చిన్నదే అయినా అది చాలా సమర్థవంతమైనదని, వైరస్ పై పొరల్లో ఉండే కొమ్ములాంటి ‘స్పైక్ ప్రొటీన్’లో ఈ మార్పు జరిగినట్టు వివరించారు.

- Advertisement -