కరోనా కేసులతో తమిళనాడు అతలాకుతలం.. 24 గంటల్లో 46 మంది బలి

- Advertisement -

చెన్నై: క‌రోనా కేసుల‌తో త‌మిళ‌నాడు అత‌లాకుత‌లం అవుతోంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా నిర్ధారిత కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న కేసులు చూసి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో గత 24 గంట‌ల్లో కొత్త‌గా 3,523 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 46 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

తాజా కేసులతో కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 74,622కు చేరుకోగా, మృతుల సంఖ్య 957కు పెరిగింది. 32,305 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. చెన్నైలో అత్య‌ధికంగా 47,650, చెంగ‌ల్ ప‌ట్టులో 4,407, తిరువ‌ల్లూరులో 3,085, కంచీపురంలో 1488, తిరువ‌న్న‌మ‌లైలో 1428 కేసులు న‌మోదు అయ్యాయి.

- Advertisement -
- Advertisement -