ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం.. కరోనా బాధితులకు వైద్యం చేస్తూ మరణిస్తే రూ.కోటి…

arvind kejriwal-lg
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 బారినపడిన వారికి వైద్యం చేస్తూ మరణించిన వారికి కోటి రూపాయలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

చదవండి: ఉత్తరప్రదేశ్‌లో ఆగని కరోనా కేసులు.. వంద దాటిన వైనం!

వైద్యులతో పాటు నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈ జాబితాలోకి వస్తారని తెలిపింది. పరిహారం విషయంలో ప్రభుత్వ, ప్రవేటు ఆసుపత్రులన్న తేడా ఏమీ ఉండబోదన్నారు.

నిజంగా సంచలన నిర్ణయమే…

కరోనా సోకిన వారికి సేవ చేస్తూ పై రంగాల వారు ఎవరు మరణించినా వారికి ఈ సాయం లభిస్తుందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు.

ఢిల్లీలో ఇప్పటి వరకు 123 కోవిడ్-19 కేసులు నమోదు కాగా, అందులో 115 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆరుగురు కోలుకోగా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

ఇక దేశవ్యాప్తంగా చూస్తే ఇప్పటి వరకు 1899 కేసులు నమోదయ్యాయి. అందులో 1691 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 155 మంది రికవర్ కాగా, 53 మంది ప్రాణాలు కోల్పోయారు.

చదవండి: వారి వల్లే రాష్ట్రంలో కరోనా మరింత వ్యాప్తి.. ఒకేరోజు 70 మందికి పాజిటివ్: ఏపీ సీఎం జగన్
- Advertisement -