బాధితుడి ప్రాణాలు కాపాడేందుకు ఆగిన గణేశ్ శోభాయాత్ర.. వీడియో చూడండి!

12:04 pm, Fri, 13 September 19

పుణె: బాధితుడి ప్రాణాలు కాపాడేందుకు భారీగా సాగుతున్న గణేశ్ శోభాయాత్ర. మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఈ ఘటన అందరికీ ఆదర్శంగా నిలిచింది.

నగరంలోని లక్ష్మీరోడ్డులో నిన్న గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది. యాత్ర కోలాహలంగా సాగుతుండగా ఓ బాధితుడిని మోసుకెళ్తూ అంబులెన్సు ఆ వైపుగా వచ్చింది.

అయితే, వందలాదిమందితో రోడ్డు కిక్కిరిసిపోయి ఉంది. ఏం చేయాలో అంబులెన్స్ డ్రైవర్‌కు అర్థం కాలేదు. దిక్కుతోచని స్థితిలో డ్రైవర్ చుట్టూ చూస్తుండగా అప్పుడే అద్భుతం జరిగింది.

అంబులెన్సును గమనించిన ప్రజలు ఒక్కసారిగా పక్కకు తప్పుకుని దారిచ్చారు. దీంతో క్షణాల్లోనే అంబులెన్స్ వెళ్లేందుకు దారి ఏర్పడింది. శోభాయాత్రను అంబులెన్స్ దాటగానే మళ్లీ యథావిధిగా యాత్ర ముందుకు కదిలింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ చూడండి.